వైరాలో కాంగ్రెస్ అభ్యర్ధి రాందాస్ ఘన విజయం
వైరాలో కాంగ్రెస్ అభ్యర్ధి రాందాస్ ఘన విజయం
– కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
జూలూరుపాడు , శోధన న్యూస్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తోపాటు వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాందాస్ నాయక్ 33045 ఓట్ల మెజార్టీతో గెలవటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుని బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్ ప్రతి రౌండ్లోను మెజార్టీ సాదింస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకట రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి ఆనందం పంచుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లలతో కాంగ్రెస్ పార్టీకి మొదలైన హవా ఈవిఎంల ఓట్ల లెక్కింపులో అత్యధిక గెలుపు దిశగా దూసుకుపోయింది. వైరా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్ కు మండలంలోని ఓటర్లు అత్యధిక మెజార్టీ ఇచ్చారు.మండలంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బలమైన నాయకత్వం కలిగివుంది.నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నాటి నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మండలంలో ఓటర్లు బాసటగా నిలిచారు.పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మనోనిబ్బరం కోల్పోకుండా పార్టీ ని అంటుపెట్టుకుని ఉన్నారు.2014 లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా పొత్తుల్లో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించటంతో కాంగ్రెస్ పార్ట్ ఓటర్లు వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాణోత్ మదన్ లాల్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేసి గెలిపించారు.2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి బలపర్చిన సిపిఐ పార్టీ అభ్యర్థి బాణోత్ విజయభాయ్ బరిలో నిలిచారు.కాంగ్రెస్ సిపిఐ పార్టీల పొత్తులను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ రెబల్ , ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన లావుడియా రాములు నాయక్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్ట్ కార్యకర్తలు పని చేసారు.స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములు నాయక్ కు అధికార బిఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ కంటే మండలంలో 900 ఓట్ల మెజార్టీ దక్కింది. మండలంలో రాందాస్ నాయక్ 2441 ఓట్ల మెజార్టీ సాదించారు. ఇప్పటి ఎన్నికల్లో బిఆర్ ఎస్ అభ్యర్థి మదన్ లాల్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్ 933913 ఓట్లు పొంది 33045 భారీ మెజార్టీతో విజయం సాధించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని,వైరా నియోజకవర్గంలో రాందాస్ నాయక్ గెలవాలని గత ఇరువై రోజులుగా అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కృషి తో అనుకూలమైన ఎన్నికల ఫలితాలు రావటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సహంగా సంబురాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకట రెడ్డి,వేల్పుల నర్సింహారావు, దుద్దుకురి మధుసూదన్ రావు,పొన్నెకంటి సతీష్,రామిశెట్టి రాంబాబు, నర్వినేని పుల్లారావు, దుద్దుకురి సుమంత్,గుగులోత్ రాందాస్ నాయక్,పోతురాజు నాగరాజు,మాచినేని సత్యనారాయణ, బాణోత్ శాంతి లాల్,సపవట్ నరేష్,నున్న రంగారావు,వేమూరి కనకయ్య,పనీతి వెంకటేశ్వర్లు,రోకటి సురేష్, మాజీ ఎంపిపి లాలునాయక్,అల్లాడి లింగరావు, లకావత్ రమేష్,రిటైర్డ్ ఏ ఎస్సై హాథిరామ్, బాణోత్ ధర్మా, తదితరులు పాల్గొన్నారు.