తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వ్యయానికి సంబంధించిన అంశాలు రికార్డు చేయాలి  

వ్యయానికి సంబంధించిన అంశాలు రికార్డు చేయాలి

-జిల్లా వ్యయ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు 
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్: ఎన్నికలు ప్రక్రియలో వ్యయానికి సంబంధించిన అన్ని అంశాలు రికార్డు చేయాలని వ్యయ నోడల్ అధికారి, సహ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో సహాయ వ్యయ పరిశీలన అధికారులు, అకౌంట్స్, వీడియో సర్వలెన్సు, వీడియో వ్యూయింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ద్వారా రాజకీయ పార్టీలు నిర్వహించు సభలు, సమావేశాలు, ర్యాలీల వివరాలు తీసుకుని, వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు ఎన్నికల సంఘం 40 లక్షల రూపాయల వరకు సీలింగ్ విధించిందని, ప్రతి పైసా లెక్కింపు జరగాలని చెప్పారు. 10 వేలకు మించి చెల్లింపులున్నట్లయితే చెక్కు, ఆర్టిజిఎస్, ఆన్లైన్ ద్వారా బదిలీ చేయాలని చెప్పారు. అభ్యర్థులు ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతా నుండి మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల పరిశీలకులు మూడు సార్లు తనిఖీ చేసే అవకాశం ఉన్నదని, ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా పకడ్బందిగా నమోదులు చేయాలని చెప్పారు. సహాయ వ్యయ నియంత్రణ అధికారులు విధులు చాలా ముఖ్యమని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో మన విధులు తలమానికమని చెప్పారు. ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు చట్టపరమైన విధులు నిర్వహిస్తున్నామని చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎప్పటి కపుడు షాడో, అభ్యర్థి ఖర్చుల రిజిష్టర్లు పరిశీలన చేయాలని సూచించారు. వ్యయ రిజిష్టర్లు నిర్వహణపై అభ్యర్థులకు నియోజకవర్గాలలో అవగాహన నిర్వహించాలని చెప్పారు. అన్ని ఖర్చుల వివరాలు ప్రతి రోజు రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. పొరపాట్లుకు తావులేకుండా పకడ్బందిగా నిర్వహించాలని, ఏదేని పొరపాటు జరిగితో ఎన్నికల సంఘ నియమ, నిబంధనలు ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ప్రతి అంశాన్ని వీడియో గ్రఫి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వ్యయ నియంత్రణ కో ఆర్డినేటింగ్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, మాస్టర్ ట్రైనీ నోడల్ అధికారి శ్రీనివాసరావు, యంసియంసి నోడల్ అధికారి శ్రీనివాసరావు, సహాయ వ్యయ పరిశీలన అధికారులు, అకౌంట్స్, టీము, వీడియో సర్వలెన్సు, వీడియో వ్యూయింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *