శాఖ గ్రంథాలయాన్నీ పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
శాఖ గ్రంథాలయాన్నీ పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
ఇల్లందు, శోధన న్యూస్ : శాఖ గ్రంధాలయాన్ని గురువారం మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు.జనవరి మొదటి వారంలో పూర్తిస్థాయి ఫర్నిచర్ పుస్తకాలతో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా నూతన గ్రంథాలయ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారికి కావాల్సిన సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. శాఖ గ్రంధాలయ ఇన్చార్జ్ తో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. సింగరేణి సి ఎస్ ఆర్ నిధులు రెండు లక్షల రూపాయలతో రీడింగ్ చైర్స్ 50, ఫైబర్ చైర్స్ 16, బీరువాలు 8 , టేబుల్లు 18 కొనుగోలు చేశారు వాటిని పరిశీలించారు యువకులు విద్యార్థులు అందరూ గ్రంథాలయాన్ని ఉపయో
గించుకోవాలని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞాన పెరుగుదలతో పాటు విజ్ఞానాన్ని కూడా నేర్పుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాఖ గ్రంధాల ఇన్చార్జి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తి రంజిత్ ఎర్ర ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.