ఖమ్మంతెలంగాణ

 సమర్థవంతంగా ఎన్నికల విధులను నిర్వర్తించాలి  -ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

 సమర్థవంతంగా ఎన్నికల విధులను నిర్వర్తించాలి 

-ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

మధిర శోధన న్యూస్: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కాజీ పురం పాలిటెక్నికల్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్, సిరిపురం ప్రభుత్వ హైస్కూల్, ఆకస్మాత్తుగా తనిఖీలు చేపట్టి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి వసతులు పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ అర్హుడైన ఓటరు వచ్చి ఓటు వేస్తున్నారా గమనించి, వారితో ఓటు వేయించడమే ఓపిఓ ల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా అందరికి సమాన హక్కులు కల్పించబడ్డాయని, ప్రతి మనిషికి ఒకే ఓటు ఉంటుందని ఆయన తెలిపారు. ఓటర్ ఐడెంటిఫికేషన్ జాగ్రత్తగా చేయాలని, వేలికి ఇంక్ రాసే ముందు, గుడ్డతో వేలిని తుడవాలని అన్నారు. పోలింగ్ సామాగ్రి తీసుకొని, అనెక్జర్ 5 ప్రకారం చెక్ చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్ళాక, పరిసరాలు గమనించి, ఓటింగ్ కంపార్టుమెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏజెంట్ లకు పాసులు ఇవ్వడం, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాలు తయారుచేసుకోవడం చేయాలన్నారు. పోలింగ్ అధికారి-1, 2, 3 ల విధులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో 1456 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుచేసినట్లు, ఈసారి వంద శాతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విధుల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా, నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఆయన వెంట మధిర రిటర్నింగ్ అధికారి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, సహాయ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, మధిర మునిసిపల్ కమీషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *