సాయిబాబా గుడిలో మల్లు నందిని విక్రమార్క ప్రత్యేక పూజలు
సాయిబాబా గుడిలో మల్లు నందిని విక్రమార్క ప్రత్యేక పూజలు
మధిర, శోధన న్యూస్ : మల్లు భట్టివిక్రమార్క మధిర ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా పదవులు పొందిన సందర్భంగా గురువారం మధిర పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఉప ముఖ్యమంత్రి, అర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించి ధుని ఉండిలో 108 కొబ్బరికాయలు వేసి మొక్కు తీర్చుకొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా స్థానిక డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి మల్లు నందినికి ఆశీర్వద వచనాలు ఇచ్చారు. అదేవిధంగా మధిర రామాలయంలో జరిగే ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా మల్లు నందినికి రామాలయం చైర్మన్ పల్లబోతు ప్రసాదరావు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, దారా బాలరాజు, టీవీ రెడ్డి, గుండె మెడ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.