సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమం-ప్రభుత్వ విప్ రేగా
సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమం
-ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా… రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
– ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా
పినపాక, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామపంచాయతీలోని రెడ్డిగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమ్మక్క సారక్క ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మెయిన్ సెంటర్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులను , కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు। ఎస్సీ కాలనీ, ఎస్టి కాలనీ, లంబాడి తండా, పెరిక గుంపు ఏరియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలిత పార్టీ శ్రేణులు పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు, మంగళ హారతులతో డప్పు చప్పులతో మహిళలు స్థానిక ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రే గా కాంతారావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్కృ షి చేస్తున్నారని రైతు బంధు ఎకరానికి మొదటి ఏడాది 12 వేల నుంచి ఐదు సంవత్సరాల కాలంలో 16 వేలకు పెంచి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. రైతు బీమా పథకం ద్వారా లక్ష మందికి పైగా రైతులు లబ్ధి పొందాలని 73 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నారన్నారు. మహిళ సాధికరతే లక్ష్యంగా ముందుకు రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో పేద మహిళలకు 3000 గౌరవ భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టో లో పేర్కొన్నారని, దేశంలో ఎక్కడలేని విధంగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు. స్వయం శక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా అత్యుధునిక వైద్యశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఇప్పటివరకు పది లక్షల ఉన్న ఆరోగ్య బీమా గరిష్ట పరిమితిని కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకంతో 15 లక్షలకు పెంచి మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. ఆసరా పెన్షన్ తో అర్హులైన వారికి చేతన అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రూ 3000 ఉన్న పెన్షన్ ప్రతి సంవత్సరం పెంచుతూ 5000 ఇచ్చినందుకు చర్యలు తీసుకున్నారన్నారు, అదేవిధంగా దివ్యంగులకు పెన్షన్ ఇటీవల నాలుగు వేలకు పెంచారని అని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ పై ఉన్న బియ్యం అందించినందుకు అన్నపూర్ణ పథకం మ్యానిఫెస్టో తో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, దీంతో 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు, అదేవిధంగా 400కే వంట గ్యాస్ అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు అని తెలిపారు. అదే విధంగా అగ్రవర్ణ పేదలకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కెసిఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఏ విధంగా ఉండేదో నేడు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. రేవంత్ రెడ్డి అధికారాన్ని దక్కించుకోవాలని ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మరో మారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటే ప్రజలకు నమ్మకం లేదన్నారు.