తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే  జారే

సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే జారే
దమ్మపేట , శోధన న్యూస్ : అశ్వారావుపేట ఎమ్మెల్యే  జారే ఆదినారాయణ ఆదివారం మండలంలోని సుధాపల్లి లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరీ సోదరీమణులతో కలిసి స్థానిక చర్చిలో కేక్ కట్ చేసి సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శప్రాయం అని నేటి సమాజం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాదరావు, మండలంలోని పలువురు సర్పంచులు, చర్చి పాస్టర్లు, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *