స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృత పర్యటన
లక్ష్మీపురం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృత పర్యటన
– అభివృద్ధి పనుల పర్యవేక్షణ
-వివిధ శాఖల అధికారులకు సూచనలు
వైరా, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్తు శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వారి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో పర్యటించారు.ఈ సందర్భంగా తొలుత గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం విక్రమార్క-నందిని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురం గ్రామం నుండి వైరా ప్రధాన రహదారికి కలుపు బీటీ రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన సంబంధిత శాఖ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. రానున్న మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలనీ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామం నుండి నిర్మాణం జరుగుతున్న బీటీ రోడ్డు పనులను వేగవంతం చేసి శివరాత్రి కంటే ముందే త్వరగా పూర్తి చేయాలని సంబంధించిన శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ ఎండోమెంట్, ఆర్ డబ్ల్యూ, ఇరిగేషన్, టూరిజం, స్పోర్ట్స్ అథారిటీ శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలను డిప్యూటీ సీఎం జారీ చేశారు. అనంతరం గ్రామ అభివృద్ధి పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలు పరిష్కరించాలంటూ డిప్యూటీ సీఎంకు పలువురు ప్రముఖులు గ్రామస్తులు విజ్ఞాప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పి దుర్గాప్రసాద్ నాయకులు నూతి సత్యనారాయణ రాయల నాగేశ్వరరావు దొడ్డ పుల్లయ్య మల్లు రామకృష్ణ వెంకటాచారి చంద్రశేఖర్ హరిఈవో హరిచంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శి రాజు తాసిల్దార్ కేవీ శ్రీనివాసరావు పలువురు ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు గ్రామస్తులు పాల్గొన్నారు.