తెలంగాణహైదరాబాద్

స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అభివృద్ధి

స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అభివృద్ధి
సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
రాజన్న సిరిసిల్ల, శోధన న్యూస్: స్వరాష్ట్రంలోనే మన పల్లెలు అభివృద్ధి చెందాయని,సిరిసిల్ల అభివృద్ధి అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో అన్నారు .సిరిసిల్ల బైపాస్ రోడ్డులో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. స్వరాష్ట్ర పాలనలో అప్పర్ మానేరు మత్తడి దుంకే పరిస్థితి ఉందన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో గెలిచిన తర్వాత నేతన్నల దశ మారిందని కేసీఆర్ పేర్కొన్నారు.చేనేత కార్మికులు బతకాలే మరమగ్గాలకు పని కావాలని నేత కార్మికులకు పని కల్పించే దృష్టితో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆనాడు గోడ రాతలు ఉండేవన్నారు.ఆనాడు చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకొని,పార్టీ తరఫున 50 లక్షలు ఇచ్చామని గుర్తు చేశారు.కేటీఆర్ సిరిసిల్లలో గెలిచిన తర్వాత చేనేతన్నల దశ మారిందని పేర్కొన్నారు.బతుకమ్మ చీరలు నేతన్నల కన్నీరు తుడిచే పథకమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.సిరిసిల్ల ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కేటీఆర్ అండగా ఉండగా సిరిసిల్లకు ఏ లోటు ఉండదన్నారు.సిరిసిల్లను ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళారీలు పైరవీలు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో 3 గంటల కరెంటు, రాష్ట్ర పాలనలో 24 గంటల కరెంటు అన్నారు.ధరణితో మీ భూమిపై హక్కులు మీకే ఇచ్చామని,మీ బొటనవేలు ముద్ర లేకుండా ఏ అధికారి ఏం చేయలేడు అని కేసిఆర్ అన్నారు. కులమతాల కోట్లాటలు మన పాలనలో లేవన్నారు.కేటీఆర్ ఉండగా సిరిసిల్లకు ఏ లోటు ఉండదని,సిరిసిల్ల,వేములవాడ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లకు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన ఘనత కెసిఆర్ ది అని కేటీఆర్ అన్నారు.సీఎం కేసీఆర్ పాలనలో సిరిసిల్ల సిరుల జిల్లాగా మారిందని కేటీఆర్ అన్నారు.హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,వేములవాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనరసింహారావు,టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు,జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,రాష్ట్ర కార్పోరేషన్ల చైర్మన్ లు,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *