అభివృద్ధి చేశాం… ఆశీర్వదించండి-విప్ రేగా
అభివృద్ధి చేశాం… ఆశీర్వదించండి
- అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే
- కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు
- బీఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సహకారం తో పినపాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రభుత్వ విప్, బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక అభ్యర్థి రేగా కాంతారావు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్ ఏరియాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మహిళలు ఆయన కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతు సీఎం కేసీఆర్ కే ఉందని, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రానున్నదని బీఆర్ ఎస్సే అని ఆయన స్పష్టం చేశారు, రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతోపాటు రాష్ట్రలో పంటల దిగుబడును గణనీయంగా పెరిగిన దేశానికి అన్నం పెట్టే స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు, రైతులకు రైతుబంధు బిచ్చమని రేవంత్ రెడ్డి ఎగతాళి చేస్తున్నాడని, రైతుల ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని అన్నారు. రైతుబంధుతో ప్రజాధనం వృధా అని ఉత్తంకుమార్ రెడ్డి అనడం సిగ్గుచే టన్నారు. 30 తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.