Uncategorizedతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అమర వీరుల స్పూర్తితో ముందుకు సాగాలి

అమర వీరుల స్పూర్తితో ముందుకు సాగాలి

ఇల్లందు, శోధన న్యూస్ : ప్రజాయుద్ధ పంథా,విప్లవ రాజకీయాల వైపు ప్రయాణం చేసి ఆనాటి విద్యార్థులలో మార్క్సిజం ,లెనినిజం,మావో ఆలోచన విధానం వెలుగులో బలమైన ప్రజా ఉద్యమాన్ని,విద్యార్థి సంఘాన్ని నిర్మించడం  కోసం  నిరంతరం కృషిచేసిన నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర ప్రసాద్ ల స్ఫూర్తితో నేటి విద్యార్థులు పోరాటాలలో  ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే  గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ, ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఆఫ్ లా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి అనురాధ,పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ అన్నారు.విప్లవోద్యమ నేత నీలం రామచంద్రయ్య, పి డి యస్ యూ విద్యార్థి ఉద్యమ నేత జే సి ఎస్ ప్రసాద్ ల వర్ధంతి సభను ఇల్లందు మండలం చీకటి గండ్ల అడవిలో ఆదివారం యనగంటి వంశి వర్ధన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అమరవీరుల తాత్కాలిక స్తూపం వద్ద మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను,విద్యార్థి ఉద్యమాలను నిర్మిస్తూ చైతన్యం చేస్తున్న విప్లవోద్యమ నాయకులను విజయవాడలో అరెస్టు చేసి చీకటి గండ్ల అడవిలోకి తీసుకువచ్చి అత్యంత కిరాతకంగా చిత్రహింసల గురిచేసి పోలీసులు జేసిఎస్ ప్రసాద్,నీలం రామచంద్రయ్యలను హత్య చేశారని వారి ఆశయాల బాటలో 50 ఏళ్ల విప్లవోద్యమం ముందుకు కొనసాగుతూనే ఉందని అన్నారు.నేడు దేశంలో ఫాసిస్ట్ విధానాలు మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ నిర్బంధకాండని ప్రయోగిస్తూ ప్రశ్నించే గొంతులను,హక్కుల సంఘాల నేతలను విప్లవకారులను జైల్లో నిర్బంధించే విధానాలను రూపొందిస్తూ ముందుకు వస్తున్న నేపథ్యంలో విప్లవోద్యమాలను బలంగా నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాపంథా జిల్లా నాయకులు బుర్ర వెంకన్న,యాకూబ్ షావలి బొజ్జాయిగూడెం ఏరియా ప్రజాపంథా నాయకులు కొర్స కోటన్న పి డి యస్ యూ నాయకులు పార్థసారథి, తరుణ్, సాయి, గంగాధర గణేష్,రవీనా,వర్మ, నితీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *