క్రిస్టియన్లకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
క్రిస్టియన్లకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
-అన్ని మతాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
అశ్వాపురం, శోధన న్యూస్ : క్రిస్టియన్లకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి రేగా కాంతారావు అన్నారు. అశ్వాపురం మండలం బట్టిల గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని పాములపల్లి గ్రామంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ ఉపవాస ప్రార్థనల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను క్రైస్తవ సోదరులు, పాస్టర్స్ శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమప్రధాన్యత ఇస్తున్నారని, సర్వ మతాల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాలకు ఇస్తున్న తమ ప్రాధాన్యతతో తెలంగాణ సామరస్య వాతావరణ నెలకొల్పి అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సంఘాల సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.