వేపలగడ్డ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సాధారణ ఎన్నికల పరిశీలకులు
వేపలగడ్డ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సాధారణ ఎన్నికల పరిశీలకులు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఈ నెల 30వ తేదీన జరుగనున్న శాసనసభ ఎన్నికలల్లో ఓటర్లు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్ కిషోర్ తెలిపారు. బుధవారం కొత్తగూడెం నియోజక వర్గ పరిధిలో గల సుజాతనగర్ మండలంలో వేపలగడ్డ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అని పోలింగ్ కేంద్రాలలో సురక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్, దివ్యాంగులు, వయోవృద్దుల కోసం ర్యాంపులు, దివ్యాంగుల సహాయార్థం వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బూతు స్థాయి అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు.