జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు
జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు
హనుమకొండ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి స్థానిక నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని దేశం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి యువత సేవా కార్యక్రమాలు చేయాలని ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి టిపిసిసి సభ్యులు అశోక్ రెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజి మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు పాక రమేష్ గొర్రె మహేందర్ శనిగరపు వెంకటేష్ రమేష్ బాబు నరేష్ జగన్ సాహూ నార్ల గిరి శ్రీనివాస్ వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.