Uncategorized

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. బుధవారం జిల్లాలోని అందరూ ఎంపీడీవోలు, ఎంఈఓ లు, ఎంపీ ఓలు, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ, పోలింగ్ కేంద్రాలు నిర్వహించుచున్న గ్రామ సెక్రెటరీలతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద టెంటు, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ సౌకర్యం విధిగా ఏర్పాటు చేయాలని అందరూ ఎంపీడీవోలను ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఇంకా పురో గతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు , వెంటనే పూర్తి చేసి ఓటర్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని పనులను పూర్తి చేసి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో రిపేర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో చేపట్టాలని, తాత్కాలిక మరమ్మత్తులు చేయరాదని హెచ్చరించారు.

ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ జరుగుతున్న చోట చెరువుల నుండి సారవంతమైన మట్టిని రైతుల పొలాలలో ఉపయోగించుకొనుటకు వారి సొంత ఖర్చులపై మట్టి తీసుకువెళ్లలని అట్టి రవాణాకు గ్రామ కార్యదర్శి ఎక్కడ నుంచి మట్టి తీసి వెళుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయం రసీదు ద్వారా తెలియజేస్తూ పంపాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా ట్రాక్టరు మట్టి రవాణా అక్రమ మార్గం ద్వారా జరుగుతున్నది అని పట్టుపడితే దానికి పంచాయితీ కార్యదర్శి పూర్తి బాధ్యతలు వహించవలసి ఉంటుందని, అతనిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే చోట ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని, ప్రచారం చేయడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను అనుమతించరాదని, పనులు పూర్తయ్యాక సాయంత్రం సమయంలో ప్రచారం నిర్వహించెల  వారిని కోరాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది అందరూ విధిగా ఎన్నికల నియామవళి ఆచరించి విధులు చేయాలని పోలింగ్ అనంతరం జూన్ 5 వరకు ఎన్నికల నియమావళి ఉన్నందున అందరూ జాగ్రత్తగా తమ విధులు నిర్వహించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *