నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలిషియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలిషియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్
భద్రాచలం, శోధన న్యూస్ :
చర్ల పోలీస్ స్పెషల్ పార్టీ సిబ్బంది, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సిబ్బంది తాలిపేరు లెఫ్ట్ కెనాల్ వద్ద సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా తప్పించుకొని పారిపోతున్న నిషేదిత మావోయిస్ట్ పార్టీ కి కొరియరు గా పనిచేస్తున్న వ్యక్తి ని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు
అరెస్టు కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్ వివరాలు
కారం సమ్మయ్య S/ o దారయ్య వయస్సు : 35 yrs R/O గ్రామపంచాయతి, చర్ల మండల్.
ఇతను గత 6 సం. ల నుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కి కొరియారు గా పనిచేస్తున్నాడు. తన స్వంత గ్రామం అయిన చినగేళ్లురు, ఛత్తీస్ఘడ్ రాస్ట్రం ఆదేవిదంగా తన బార్య గ్రామం అయిన యాపురం గ్రామానికి వెళ్ళి వస్తు ఉండేవారు. ఈ క్రమం లో ఉడత మల్ల గ్రామానికి చెందిన పోడియం తిరుపతి పరిచయం చయం ఏర్పడి అతని ద్వారా నిషేదిత మావోయిస్ట్ పార్టీ కి పరిచయం అయిన తర్వాత కొరియారు గా పనిచేయడం ప్రారంబించారు. ఈ క్రమంలో వారం పది రోజుల క్రితం యాంపురం గ్రామానికి వెళ్ళి నప్పుడు నిషేదిత మావోయిస్ట్ పార్టీ కి చెందిన ఉయికే కళ్ళు, బీఎన్ సప్లై టీం కమాండర్ కలిసి జులై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు ఉన్నందున కూబింగ్ వచ్చే పోలీస్ వారిని చంపాలనే ఉద్దేశం తో ఆదేవిదంగా ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేయాలనే ఉద్దేశం తో పేలుడు సామగ్రి ని తీసుకొని రమ్మనగా అట్టి పేలుడు సామగ్రి ని తీసుకొని వస్తుండగా ఈ పోలీస్ వారు అరెస్ట్ చేసినారు.
కోమటిపల్లి ఆర్ పీసి మిలిషియా సభ్యుడిగా రిక్రూట్ అయ్యి, గత సంవత్సరం క్రితం నుండి కోమటిపల్లి ఆర్ పీసి మిలిషియా డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్నాడు. ఇతడు పూజారి కాంకేర్ కోమటిపల్లి ఆర్ పీసి మిలిషియా సభ్యులతో పాటు చర్ల ఎల్ఓఎస్ దళసభ్యులతో కలిసి 2022 సంవత్సరంలో జులై, ఆగస్టు నెలలో చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో కూంబింగ్ కి వచ్చే పోలీసులను చంపాలనే లక్ష్యంతో ప్రెజర్ మైన్స్ ను అమర్చిన సంఘటనలలలో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఆదరణ లేక తెలంగాణ ప్రాంతంలో విధ్వంసకర చర్యలకు పాల్పడడానికి ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన అమాయక ఆదివాసీలను మిలిషియా సభ్యులుగా, దళ సభ్యులుగా మార్చి మార్చి పార్టీ పార్టీ ఉనికి ఉనికి కోసం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరించ వద్దని, ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తమ స్వార్థ ప్రయొజనాల కోసం అమాయకులైన ప్రజలకు మాయమాటలు చెప్పి, వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
ఇప్పటికే అనేకమంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నాయకులు, సభ్యులు తమ పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని గ్రహించి ఈ సిద్దంతాలు విజయం సాదించలేవని తెలుసుకొని, ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరుగుచున్నది. మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు తలపెట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని స్వచ్ఛందంగా గానీ, బంధుమిత్రుల ద్వారా గాని తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గాని లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను గానీ సంప్రదించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.