తోగ్గూడెం మినీ మేడారానికి పోటెత్తిన భక్తులు-గద్దెకు చేరిన సారలమ్మ తల్లి
మినీ మేడారానికి పోటెత్తిన భక్తులు
—-గద్దెకు చేరిన సారలమ్మ తల్లి
—వనదేవతలను దర్శించుకున్న ఏరియా సింగరేణి జీఎం రామచందర్, తహశీల్దార్ రాఘవరెడ్డి
—భక్తులకు అన్నదాన కార్యక్రమం
—భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సిఐ
—-మూడు రోజుల పాటు కొనసాగనున్న జాతర
మణుగూరు, శోధన న్యూస్ : ఆదివాసీలకు ఆరాధ్య తల్లులు, వనదేవతలైన సమ్మక్క- సాలరమ్మ జాతరకు మండల పరిధిలోని తోగ్గూడెం(మినిమేడారం)లో కొలువుదీరిన అమ్మవార్లకు బుధవారం భక్తులు పోటెత్తా బుధవారం నుండి శుక్రవారం వరకు జరిగే అతి పెద్ద జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటి, తోగ్గూడెం గ్రామపంచాయితీ పాలకమండలి, సింగరేణి, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్య- ఏర్పాట్లను చేశారు. మేడారం వెళ్లే భక్తులు సైతం అనేక వాహనాల్లో ఈ ప్రధాన రహదారి గుండా వెళుతూ… మినిమేడారంలో సైతం కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. జాతర తొలిరోజు ఆలయా పూజారులు వనం నుండి సారలమ్మ తల్లిని గద్దె మీదకు తీసుకొచ్చేందుకు సంప్రదాయ నృత్యాలు, ప్రత్యేక వాయిద్యాలతో వనానికిచేరుకొని సారలమ్మ తల్లిని గద్దెకు తీసుకొచ్చారు. వనదేవతల దర్శనం కోసం వచ్చిన సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్, తహశీల్దార్ రాఘవరెడ్డి లకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ పూజారులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సాధరంగా ఆహ్వానించారు. అమ్మవార్ల ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు, పెద్దలు, చిన్నలు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని మొక్కులను చెల్లించుకున్నారు. సారలమ్మ తల్లిని గద్దెకు తీసుకొచ్చే క్రమంలో ఆలయ పూజారులు, భక్తులు, అమ్మలను పూనిన భక్తురాళ్లు పూనకంతో నృత్యాలు చేశారు. వనం నుండి సారలమ్మను తీసుకొచ్చేందుకు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గద్దెకు తరలించారు.
-వాసవీ- ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన శిబిరం:
ఆదివాసీలఆరాధ్య దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర మూడు రోజుల పాటు జరగనున్న నేపధ్యంలో భక్తులకు సౌకర్యార్థం వాసవీ. వాసవీ వనితాక్లబ్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏరియా జీఎం రామచందర్, తహశీల్దార్ రాఘవరెడ్డి, సిఐ సతీష్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆదరనీయమన్నారు, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఈ ఉచిత అన్నదాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి, వాసవివనితా క్లబ్స్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సిఐ సతీష్ కుమార్ :
తోగ్గూడెం మినిమేడారంలో మూడు రోజుల పాటు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మణుగూరు డిఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సిఐ సతీష్ కుమా బుధవారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ… అమ్మవార్లను దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ప్రధాన రవాదారికి సమీపంలో ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణకు భారీ వాహనాల దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్సై రాజేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .