చిన్న కాళేశ్వరం మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలి
చిన్న కాళేశ్వరం మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలి
-భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి, శోధన న్యూస్ : చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మహాదేవపూర్ మండల పరిదిలోని, బీర సాగర వద్ద చేపట్టిన చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 45 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పంప్ హౌస్ లో ఉన్న మూడు మోటార్లు మరమ్మత్తులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పంప్ హౌస్ ద్వారా మందిరం, ఎర్ర చెరువులకు సాగు నీరు సరఫరా ఉంటుందన్నారు. రానున్న వానా కాలం వరకు పనులు పూర్తి చేయాలని ఇరిగే షన్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈలు యాదగిరి, తిరుపతిరావు ఏఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.