TelanganaUncategorized

ప్రకృతి ప్రియ పుత్రుడు సిఅండ్ఎండి బలరాం నాయక్

ప్రకృతి ప్రియ పుత్రుడు సిఅండ్ఎండి బలరాం నాయక్
ప్రకృతి తల్లి ప్రియ పుత్రుడు సింగరేణి  సిఅండ్ఎండి బలరాం నాయక్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా  జీఎం దుర్గం రామచందర్  అన్నారు.  మణుగూరు ఏరియా పి‌కే‌ఓసి-2 సైట్ ఆఫీస్ ప్రాంగణంలో   సింగరేణి కాలరీస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  ఎన్ బలరాం నాయక్    జన్మ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి పి‌కే‌ఓసి-2లో  పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
 బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు ఎంతో దూరదృష్టిగలవారు. సింగరేణి సంస్థ చైర్మెన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది మొదలు వారు సంస్థ పురోభివృద్ధికి విప్లవాత్మకమైన ప్రణాళికలకు శ్రీకారం చుట్టడo ద్వారా బొగ్గు ఉత్పత్తిలో మరియు ఉత్పాదకత, రవాణాలో గత ఆర్ధిక సంవత్సరపు 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
వారు సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా ఎంతో సహకరిస్తున్నారు. సింగరేణి ఉద్యోగులకే  కాక ఒప్పంద కార్మిక కుటుంబాలకు మేలు జరిగేలా బ్యాంక్ అధికారులతో మాట్లాడి నూతన ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించడం వారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.
 మణుగూరు ఏరియాలోనే ఎంతో ఉత్సాహంగా స్వయంగా 700 మొక్కలు నాటడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 19,000 మొక్కలను స్వయంగా నాటి అందరి చేత ప్రకృతి మాత పుత్రుడిగా ఎనలేని ప్రశంసలను, ఘనకీర్తిని  సొంతం చేసుకొని ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ గా పేరు పొందడం ఎంతో అభినందనీయంఅన్నారు.
ఈ సందర్భంగా ఏరియా  జీ దుర్గం రామచందర్ చేతుల మీదుగా చైర్మెన్ ,మేనేజింగ్ డైరెక్టర్  ఎన్ బలరాం నాయక్  జన్మదిన కేక్ ను కట్ చేయడం జరిగింది. అనంతరం పి‌కే‌ఓసిన కొత్త సైట్ ఆఫీస్ ప్రాంగణంలో అధికారులు, ఉద్యోగులు భారీ యెత్తున మొక్కలు నాటడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *