పెన్షన్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
పెన్షన్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
-మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్
మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ఈ నెల 16వ తేదిన జరిగే పెన్షన్ అదాలత్‌ను మాజీ సింగరేణియులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జీఎం దుర్గం రామచందర్ సూచించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో 16న ఉదయం 10గంటలకు పైలట్ కాలనీ యంవిటిసిలో ట్రైపార్టైట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం, పెన్షన్ అదాలత్, PRAYAS సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మణుగూరు ఏరియాలో పనిచేసి పదవీ విరమణ పొందిన మాజీ సింగరేణియులు, తాము పొందుతున్న పెన్షన్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే, సంబంధిత ధృవీకరణ పత్రాలతో పెన్షన్ అదాలత్‌కు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.


