గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను కల్పించాలి
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలతొ మగ్గిపోతు విపరీతమైన నొప్పులతో ప్రజలు బాధపడుతున్నారని, తక్షణమే గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలను మందులను పంపిణీ చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ సూపర్డెంట్ సుదర్శన్ గారికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావడం లేదని వారు అన్నారు కొమరారం లాంటి చోట్ల ఒకే హాస్పిటల్ ఉండడంతో మర్రిగూడెం గ్రామానికి చెందిన ప్రజలు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆదివాసి ప్రజలేటు పోలేక మంచాన పడి ఉన్నారని,అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని వారి కోరారు.అలాగే రేకులపల్లి మండలంలోని పాతర్లగడ్డ,రోళ్లపాడు గ్రామంలో విష జ్వరాలతో మంచాన పడ్డారని ఒకరు మృతి చెందారని అయినా వైద్యం అంది పరిస్థితుల్లో లేదని వైద్యం ప్రజల దగ్గరికి పోవడం లేదని ఆయన చర్ల దుమ్ముగూడెo మండలాలలో 10 గ్రామపంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేవలేని పరిస్థితిలో ఉన్నారని వారన్నారు.
చర్లలో డెంటల్ డాక్టర్ ఉండడంతో సమస్య పరిష్కారం కావడంలేదని, చంద్రుగొండ అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి దమ్మపేట మండలాల్లో కూడా గ్రామాలలో విశ్వవిద్యాలయాలు వ్యాపిస్తున్నాయని ముందస్తు చర్యలు చేపట్టాలని వారు అన్నారు.తక్షణమే ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, 24 గంటల అందుబాటులో ఉండే ఎంబిబిఎస్ డాక్టర్ను నియమించాలని, మెడికల్ టెస్టులు మందులు అందించే విధంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని వారు అన్నారు. ప్రధాన ఆస్పత్రులలో కూడా బెడ్స్ లేక మందు లేక టెస్టులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని డాక్టర్స్ కొరత కూడా ఉందని తక్షణమే సిబ్బంది కొరత తీర్చాలని ఏజెన్సీలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పారిశుధ్య కార్యక్రమాలను చేయించాలని వారు కోరారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య శిబిరాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి తినలేక గ్రామాలలోని నాటు వైద్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ముసలి సతీష్,కల్తి వెంకటేశ్వర్లు, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు డి ప్రసాదు,జిల్లా నాయకులు మోత్కూరు మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.