Uncategorized

ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి 

ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి 

సంగారెడ్డి ,శోధన న్యూస్: ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని సంగారెడ్డి జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి అన్నారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా, ఎన్నికల నియమావళి పై సంగారెడ్డి జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ . . . పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ నెల 16 నుండి అమలులోకి వచ్చిందని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సభలకు సమావేశాలకు, వాహనాల అనుమతులు, బహిరంగ సభలకు అనుమతులన్ని సువిధ ఆప్ లో నే పొందాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడరాదని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి లో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రచార వివరాలను తెలియజేయాలని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించినట్లు సమాచారం ఉంటే ఫోటోలు, వీడియోలను ఈసిఐ కల్పించిన సి విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చులు వివరాలు కోసం కొత్త బ్యాంకు ఖాతాను తెరవాలని తెలిపారు. బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన జమ, ఉపసంహరణలు, నగదు లావాదేవీలు ఖర్చుల రసీదు ల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని సహాయ ఎన్నికల పరిశీలకులు షాడో రిజిస్టర్లో నమోదు చేస్తున్న లెక్కలతో సరి చూసుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *